బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఏ’తో బెంగళూరులో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు గెలుపు దిశగా సాగుతున్నది. రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 275 పరుగుల ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 119/4తో నిలిచింది.
కెప్టెన్ రిషభ్ పంత్ (64*), బదోని క్రీజులో ఉన్నారు. జట్టు విజయానికి మరో 156 రన్స్ కావాలి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 199 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాను దెబ్బకొట్టిన తనుష్ కొటియాన్ (4/26) మరోసారి రాణించాడు.