గాలె: శ్రీలంక పర్యటనలో భారత్-ఏ జట్టు అదరగొట్టింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ముగిసిన రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ.. శ్రీలంక-ఏపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన భారత పేసర్ గుర్నూర్ బ్రర్.. రెండో ఇన్నింగ్స్‌లో (6/68) ఆరు వికెట్లు తీసి పర్యాటక జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 543/9 వద్ద భారత్ డిక్లేర్డ్ చేయగా రెండో ఇన్నింగ్స్‌లో లంకేయులు 209 రన్స్‌కే కుప్పకూలారు. 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జురెల్ సేన వికెట్లేమీ కోల్పోకుండానే ఛేదించింది.