దంబుల్లా : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏను వాన దెబ్బకొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన వన్డే పోరులో అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచినా.. వర్షం కారణంగా 4 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) అనూహ్యంగా ఓటమిపాలైంది. ప్రభ్‌సిమ్రన్‌సింగ్(84), రుతురాజ్ గైక్వాడ్(66), కెప్టెన్ తిలక్‌వర్మ(66) అర్ధసెంచరీలతో తొలుత భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 349/9 స్కోరు చేసింది.
వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లో 9ఫోర్లతో 44) మెరిశాడు. ఛేదనలో కెప్టెన్ ఇమ్రాన్(75 నాటౌట్), బహిర్షా(51 నాటౌట్) దూకుడుగా ఆడటంతో వర్షంతో మ్యాచ్ ఆగిపోయిన సమయానికి అఫ్గాన్ 25.5 ఓవర్లలో 177/2తో నిలిచింది. డీఆర్ఎస్ ప్రకారం అప్పటికి నాలుగు పరుగులు ఆధిక్యంలో ఉండటంతో విజయం ఆ జట్టునే వరిచింది. సోమవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో భారత్-ఏ ఆతిథ్యం శ్రీలంకతో పోటీ పడనుంది.