లక్నో: ఆస్ట్రేలియా ‘ఏ’తో లక్నోలో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో భారత ‘ఏ’ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఐదు వికెట్ల (5/93)తో సత్తాచాటాడు.
సుతార్‌తో పాటు గుర్నూర్ బ్రర్ (2/71) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా ‘ఏ’.. 350/9 స్కోరు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్ (88), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (74) అర్ధ శతకాలతో మెరిశారు.