IND W vs SA W | నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. రెండు జట్లు తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు తహతహలాడుతున్నాయి. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు మ్యాచ్‌కు తరలివచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా, దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు అమ్మాయిలను ఉత్సాహపరిచేందుకు డీవై పాటిల్ స్టేడియానికి తరలివచ్చారు.
The finale fever has hit another level 😮
Sachin Tendulkar is in the house for the big #CWC25 Final in Navi Mumbai 🤩 pic.twitter.com/FcO5di8SFH
— ICC (@ICC) November 2, 2025
జై షా, సచిన్ ఇద్దరూ కలిసి ముచ్చటించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్లను కలిసి అభినందనలు తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ని తిలకించాడు. అలాగే, మాజీ దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్ మ్యాచ్‌ను వీక్షించారు. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్, ఐపీఎల్ టీమ్ ముంబయి ఇండియన్ ఓనర్ నీతా అంబానీతో పాటు పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను తిలకించారు.
ICC Chairman Mr Jay Shah with Sachin Tendulkar at DY Patil Stadium at Navi Mumbai. pic.twitter.com/wwIsYKT3UC
— MANU. (@IMManu_18) November 2, 2025
Rohit Sharma watching Final 🔥🇮🇳 pic.twitter.com/BvWfpXM6ag
— Team India (@FCteamINDIA) November 2, 2025
Legends in the stands! 🏏🇮🇳 Sunil Gavaskar & VVS Laxman spotted watching the INDW vs SAW Final live at Navi Mumbai.#SunilGavaskar #VVSLaxman #CricketLegends #INDWvsSAW #WorldCupFinal #WomensCricket #CricketFinal #DYPatilStadium #CWC2025 pic.twitter.com/AQ4lQjoTDf
— Mera Gurgaon News (@MeraGurgaonNews) November 2, 2025
3in1 frame sachi sir jay shaa and neeta ambani #INDWvsSAW pic.twitter.com/vPKZlVFjhM
— Rattiram (@Rattira58258012) November 2, 2025