భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అదరగొడుతోంది. 155 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్ రేణుకాసింగ్ ముప్పుతిప్పలు పెట్టింది. ఆమె బౌలింగ్ ఆడలేక ఆస్ట్రేలియా టాపార్డర్ విలవిల్లాడింది.
తొలి ఓవర్ రెండో బంతికే హేలీ (0)ను డకౌట్ చేసిన రేణుక.. ఆ తర్వాత వరుసగా బెత్ మూనీ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (8), తహిలా మెక్‌గ్రాత్ (14)ను పెవిలియన్ చేర్చింది. ఇలా టాపార్డర్ బ్యాటర్లను ఆమె వరుసగా పెవిలియన్ చేర్చడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ జట్టు 41/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత 8వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్‌లో రచెల్ హేన్స్ (9) కూడా పెవిలియన్ చేరింది. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 66 పరుగులతో నిలిచింది.