భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన కైటానో (13) మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6), మున్యోంగా (15), కెప్టెన్ చకాబ్వా (16) నిరాశ పరిచారు.
షాన్ విలియమ్స్ (45) హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో అవుటయ్యాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే జట్టు ఐదు వికెట్ల నష్టానికి 130 పరుగులతో నిలిచింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.