టీమిండియా స్టార్ లెట్స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వెస్టిండీస్ జట్టులో నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ అరుదైన ఫీట్ సాధించాడు.
ఇది చాహల్‌కు 60వ వన్డే మ్యాచ్. దీనిలో విండీస్ స్టార్ నికోలస్ పూరన్ వికెట్ తీసిన చాహల్.. వన్డేల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌లో 20వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. మూడో బంతికే పూరన్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో అత్యంత వేగంగా 100 వన్డే వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా చాహల్ రికార్డు సాధించాడు.
అతనికన్నా ముందు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ఇర్ఫాన్ పఠాన్ ఈ జాబితాలో ఉన్నారు. విండీస్‌తో మ్యాచ్‌లో పూరన్ వికెట్ తర్వాత మరో మూడు వికెట్లు తీశాడీ లెగ్ స్పిన్నర్. దీంతో అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు చాహల్‌కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు.
And, 101 in quick succession 💪💪#INDvWI https://t.co/r2WqMVPbI4
— BCCI (@BCCI) February 6, 2022
Yuzvendra Chahal is adjudged the Man of the Match for his bowling figures of 4/49.#INDvWI @Paytm pic.twitter.com/AvsDGfiCeJ
— BCCI (@BCCI) February 6, 2022