IND vs SL : టీమిండియా బౌలర్లు వెంట వెంటనే వికెట్లు పడగొడుతుండడంతో శ్రీలంక కష్టాల్లో పడింది.ఉమ్రాన్ బౌలింగ్‌లో థీక్షణ బౌల్డ్ అయ్యాడు. దాంతో లంక 8 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా హసరంగను ఎల్బీగా వెనక్కి పంపాడు. హసరంగ (9) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు లెగ్ స్పిన్నర్ రెండు వికెట్లతో శ్రీలంకను దెబ్బతీశాడు. కీలకమైన చరిత అసలంక (22), డిసిల్వా(19) వికెట్లు తీసి పర్యాటక జట్టును ఒత్తిలోకి నెట్టాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఆవిష్క ఫెర్నాండో అవుట్ అయ్యాడు. ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా (15), ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కుశాల్ మెండిస్ (23) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. బౌలర్లు రాణించడంతో భారత్ విజయం దిశగా పయనిస్తోంది.
229 టార్గెట్‌తో బరిలోకి దిగిన లంకకు ఓపెనర్లు కుశాల్ మెండిస్, ప్రథుమ్ నిస్సంకా శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీళ్లిద్దరూ 44 పరుగులు జోడించారు. అయితే అక్షర్ పటేలో ఈ జోడిని విడదీశాడు. ఆ తర్వాత చాహల్ రెండు వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు.