Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాంఖడే మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ మొదట బ్యాటింగ్ చేయాల్సి రాగా.. చివరి ఓవర్లో కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటను జడేజా పెడచెవిన పెట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన హిట్‌మ్యాన్.. జడ్డూపై అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49 ఓవర్లు ముగిసేసరికి 352/6తో నిలిచింది. చివరి ఓవర్లో స్పెషలిస్ట్ బ్యాటర్ రవీంద్ర జడేజాతో పాటు.. మహమ్మద్ షమీ క్రీజులో ఉన్నాడు. దీంతో డగౌట్ నుంచి రోహిత్.. జడ్డూకు కొన్ని కీలక సూచనలు చేశాడు. చివరి ఓవర్లో మొత్తం ఆరు బంతులు జడేజానే ఎదుర్కోమన్నట్లు అతడు సైగలు చేశాడు. ఇది అర్థం చేసుకున్న జడ్డూ తొలి బంతికి రెండు పరుగులు తీసి.. తిరిగి స్ట్రయింకింగ్కు వచ్చాడు. అయితే రెండో బంతికి మాత్రం సింగిల్ రావడంతో జడేజా నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
మూడో బంతికి షమీ రనౌట్ కాగా.. నాలుగో బంతికి బుమ్రా సింగిల్ తీసి తిరిగి జడేజాకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఐదో బంతిని ఆడలేకపోయిన జడ్డూ.. చివరి బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. దీంతో ఆఖరి ఓవర్లో టీమ్ఇండియా.. 2 వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే రబట్టింది. అప్పటి వరకు మంచి జోరుతో సాగుతున్న ఇన్నింగ్స్‌లో ఈ ఓవర్ వల్ల భారత్ ఆశించిన దాని కంటే కాస్త తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించింది. అదే రోహిత్ చెప్పినట్లు.. చివరి ఓవర్లో ఆరుకు ఆరు బంతులు జడేజానే ఎదుర్కొని ఉంటే.. బాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి ముంబై వేదికగా జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (92), విరాట్ కోహ్లీ (88), శ్రేయస్ అయ్యర్ (82) అర్ధశతకాలతో రాణించారు. ఒక దశలో ముగ్గురూ శతకాలు చేసేలా కనిపించినా.. అది సాధ్యపడలేదు. శ్రీలంక బౌలర్లలో మధుషనక 80 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.