సిరీస్‌లో తొలి టెస్టు ఆడుతున్న పేసర్ ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నైట్ వాచ్మెన్ కేశవ్ మహరాజ్ (25) సూపర్ డెలివరీతో పెవిలియన్ చేర్చిన అతను.. పటిష్టమవుతున్న భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు మరోసారి వాన్ డర్ డస్సెన్ (21), కీగన్ పీటర్సన్ (52 నాటౌట్) పార్టనర్ షిప్‌ను బ్రేక్ చేశాడు.
సఫారీల ఇన్నింగ్స్ 40వ ఓవర్లో రెండో బంతికి వాన్ డర్ డస్సెన్‌ను బోల్తా కొట్టించాడు. ఉమేష్ వేసిన బంతికి ఒక్క క్షణం ఆలస్యంగా రియాక్ట్ అయిన వాన్ డర్ డస్సెన్ మూల్యంగా వికెట్ చెల్లించుకున్నాడు. భారీ ఎడ్జ్ తీసుకున్న బంతి రెండో స్లిప్‌లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్లింది.
దాన్ని సులభంగా అందుకున్న కోహ్లీ.. వాన్ డర్ డస్సెన్‌ను పెవిలియన్ పంపాడు. దీంతో 112 పరుగుల వద్ద సఫారీ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అతను అవుటైన కాసేపటికే పీటర్సన్ తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పీటర్సన్‌తోపాటు టెంబా బవుమా క్రీజులో ఉన్నారు.