హోరాహోరీ పోరుకు కేప్‌టౌన్ వేదిక కానుంది. వాండరర్స్‌లో ఓటమెరుగని భారత్‌పై విజయం సాధించిన సఫారీలు.. కేప్‌టౌన్‌లో కూడా విజయ ఢంకా మోగించాలని చూస్తున్నారు. రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో ఓడిపోయిన టీమిండియా.. కోహ్లీ రాకతో పదునైన వ్యూహాలు రచించి, సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
ఈ రెండు జట్లు తమ కలలు నెరవేర్చుకునేందుకు కేప్‌టౌన్‌లో తలపడనున్నారు. జనవరి 11 మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు కోసం భారత జట్టు కేప్‌టౌన్ చేరుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. భారత ఆటగాళ్లు కేప్‌టౌన్ చేరుకున్న వీడియోను షేర్ చేసింది. వెన్నునొప్పితో రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ తిరిగి జట్టులో చేరనున్నాడు.
దీంతో అతని స్థానంలో అవకాశం దక్కించుకొని రాణించిన హనుమ విహారి స్థానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని పుజారా, రహానే ఇద్దరూ రెండో టెస్టులో అర్ధశతకాలతో రాణించడంతో వారినే కొనసాగించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ద్రావిడ్ కూడా విహారి, అయ్యర్లు మరికొంత కాలం వేచి చూడక తప్పదని చెప్పాడు.
కోహ్లీ రాకతో విహారి మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెండో టెస్టులో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో మైదానం వీడిన సిరాజ్ కూడా మూడో టెస్టు ఆడేది లేనిదీ అనుమానంగా ఉంది. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.
Touchdown Cape Town 📍🇿🇦#TeamIndia #SAvIND pic.twitter.com/TpMtyPK9FG
— BCCI (@BCCI) January 8, 2022