IND vs SA Live Updates | కప్ కొట్టడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. దానికి తగ్గట్టుగానే రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో పోరుకు సిద్ధమైంది. గ్రూప్ -2లో భాగంగా పాక్, నెదర్లాండ్స్‌పై గెలిచిన రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాతో తలపడుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో నంబర్‌వన్‌గా ఉండగా.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా కావడంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరి ఈ రెండు టీమ్‌ల్లో ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం..
దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. స్టబ్స్ (6) ఔటయ్యాడు.
హాఫ్ సెంచరీతో చెలరేగిన మర్క్రమ్ ఔటయ్యాడు. 16వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతికి మర్క్రమ్ ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోర్ 102/4
దక్షిణాఫ్రికా బ్యాటర్ మర్క్రమ్ హాఫ్‌సెంచరీతో రాణించాడు. డేవిడ్ మిల్లర్‌తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. ఫలితంగా 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టీమిండియాపై దక్షిణాఫ్రికా గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు కావాలి.
టీమిండియా సెట్ చేసిన టార్గెట్‌ను చేధించడంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడుతున్నారు. క్వింటెన్ డికాక్ (1), బవుమా (10), రుస్సో (0) ఏ మాత్రం రాణించలేకపోయారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 40 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్లో బవుమా (10) ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసేరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది
సఫారీలకు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో మొదటి బంతికే ఓపెనర్ క్వింటెన్ డికాక్ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా స్కోర్ 3/1
టీమిండియా నిర్దేశించిన 134 పరుగులను చేధించేందుకు సఫారీలు బ్యాటింగ్ ప్రారంభించాయి. క్వింటెన్ డికాక్, బావుమా క్రీజులోకి దిగారు.
IND vs SA | టాప్ఆర్డర్లు, మిడిలాడర్లు విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సఫారీల ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మొదట్నుంచి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఐదు ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (12) దూకుడుగా మ్యాచ్ ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. బౌండరీ లైన్ వద్ద రబాడా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔటయి పెవిలియన్ చేరాడు. యంగ్ బ్యాటర్ దీపక్ హుడా (౦), హార్దిక్ పాండ్యా (2) దారుణంగా విఫలమయ్యారు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులు తెచ్చే బాధ్యతను సూర్యకుమార్ యాదవ్ తన భుజాల మీద వేసుకున్నాడు. ఒక్కడే పరుగులు చేశాడు. అతనికి కాసేపు దినేశ్ కార్తిక్ అండగా నిలబడ్డాడు. దినేశ్ కార్తీక్ (6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అశ్విన్ (7) కూడా విఫలమయ్యాడు. సూర్యకుమార్ (68) ఔటయ్యాక వచ్చిన బౌలర్లు ఎవరూ సత్తా చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 13౩ పరుగులకే పరిమితమైంది.
Innings Break!@surya_14kumar shines with the bat as #TeamIndia post 133/9 on the board. #T20WorldCup | #INDvSA
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/KBtNIjPFZ6 pic.twitter.com/DNNQtZfiHu
— BCCI (@BCCI) October 30, 2022
కష్టాల్లో ఉన్న టీమిండియాకు కీలక పరుగులు అందించిన సూర్యకుమార్ ఔటయ్యాడు. 19వ ఓవర్లో ఔటై పెవిలియన్ చేరాడు.
దినేశ్ కార్తిక్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 7 పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు.
టీమిండియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. దినేశ్ కార్తీక్ ( 6) ఔటయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్, దీనేశ్ కార్తీక్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు.. వీరిద్దరూ కలిసి 52 పరుగులు జోడించారు.
టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 15 ఓవర్లకు టీమిండియా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. సఫారీల బౌలింగ్‌కు వరుస వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9), కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా ( 2) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 60 పరుగులకే పరిమితమైంది.
టీమిండియా వరుస వికెట్లను కోల్పోతూనే ఉంది. దీపక్ హుడా డకౌట్ కావడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా.. రెండు పరుగులకే ఔటయ్యాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 51-5
టీమిండియా సఫారీలకు వరుస వికెట్లను సమర్పించుకుంటుంది. ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ ఔటవ్వగా.. టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన దీపక్ హుడా డకౌట్ అయి పెవిలియన్ చేరాడు
India lose their fourth as South Africa gain control in Perth 👀#INDvSA | #T20WorldCup | 📝: https://t.co/GI5MZQJSjA pic.twitter.com/GkOdxshU2g
— ICC (@ICC) October 30, 2022
పరుగుల వేటలో టీమిండియా తడబడుతుంది. ఏడో ఓవర్లో విరాట్ కోహ్లీ కూడా ఔటయ్యాడు. ఫలితంగా ఏడో ఓవర్ ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 41 పరుగులు మాత్రమే ఏసింది.
టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయింది. ఎంగ్డీ బౌలింగ్‌లో రోహిత్‌శర్మ (15), కేఎల్ రాహుల్ (9) క్యాచ్ ఔట్ అయ్యారు. ఫలితంగా ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే చేసింది.
రోహిత్ శర్మ (15) క్యాచ్ ఔట్ అయిన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ ( 9 ) కూడా పెవిలియన్ చేరాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 26/2గా ఉంది. క్రీజులో కోహ్లీ, సూర్యకుమార్ ఉన్నారు.
A good Powerplay for South Africa with the India openers back in the hut 😯#INDvSA | #T20WorldCup | 📝: https://t.co/GI5MZQJSjA pic.twitter.com/H0JQGQNcBZ
— ICC (@ICC) October 30, 2022
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. లుంగి ఎంగిడి వేసిన బంతిని భారీ షాట్‌గా మలచబోయి రోహిత్ శర్మ (15) ఔటయ్యాడు.
టీమిండియా తన స్కోర్‌ను సిక్సర్‌తో ప్రారంభించింది. రబాడా వేసిన షార్ట్‌పిచ్ బాల్‌ను రోహిత్ వర్మ సిక్స్ బాదాడు. సిక్సర్‌తో మొదలుపెట్టిన టీమిండియా.. నిలకడగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసేసరికి 14 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (7), కేఎల్ రాహుల్ (7) ఉన్నారు.
🚨 Milestone Unlocked 🔓
3⃣6⃣ & going strong - Most Matches (in Men's Cricket) in #T20WorldCup ! 💪 💪
Congratulations to #TeamIndia captain @ImRo45 👏 👏
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6 #INDvSA pic.twitter.com/OHOuIzJ2Ue
— BCCI (@BCCI) October 30, 2022
🚨 Toss & Team News from Perth 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against South Africa. #T20WorldCup | #INDvSA
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6
1⃣ change to our Playing XI as @HoodaOnFire is named in the team 🔽 pic.twitter.com/X9n5kLoYNn
— BCCI (@BCCI) October 30, 2022
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
🚨 Toss & Team News from Perth 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against South Africa. #T20WorldCup | #INDvSA
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6
1⃣ change to our Playing XI as @HoodaOnFire is named in the team 🔽 pic.twitter.com/X9n5kLoYNn
— BCCI (@BCCI) October 30, 2022