మూడో టెస్టుపై సౌతాఫ్రికా పట్టుబిగిస్తోంది. కోహ్లీ వికెట్ పడిన తర్వాత మరెవరూ పంత్‌కు సహకారం అందించలేకపోతున్నారు. అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేష్ (0) వరుసగా అవుటయ్యారు. దీంతో ఒకపక్క పంత్ ఉన్నా మరోపక్క అతనికి సహకారం అందడం లేదు.
రబాడ బౌలింగ్‌లో బౌన్స్ అయిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన ఉమేష్ యాదవ్.. వికెట్ కీపర్ వెరీనేకు క్యాచ్ ఇచ్చాడు. పది బంతులు ఆడిన ఉమేష్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు.
కనీసం 250 పరుగుల ఆధిక్యం ఉంటే గెలుపు తథ్యమని నిపుణులు చెప్తుండగా.. భారత్ ఇంకా 193 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. భారత్‌ను ఆలౌట్ చేయడానికి సఫారీలకు మరో రెండు వికెట్లు చాలు. ఈలోపు పంత్ దూకుడుగా ఆడి భారత్‌ను గట్టెక్కిస్తాడేమో చూడాలి.
భారత బ్యాటర్లలో కోహ్లీ, పంత్ తప్ప మిగతా ఎవరూ కనీసం ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్ కోహ్లీ భారీగా పరుగులు చేయకపోయినా.. పట్టుదలగా ఆడి సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.