సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. మిడిలార్డర్ విఫలం అవడంతో అనుకున్నంత స్కోరు చేయలేకపోయిన టీమిండియా.. బౌలర్లు సత్తా చాటడంతో సఫారీలను కట్టడి చేస్తోంది. ఇప్పుడు 11వ ఓవర్లో ప్రమాదకరమైన డేవిడ్ మిల్లర్ (3)ను హర్షల్ అవుట్ చేశాడు. హర్షల్ వేసిన బంతిని సరిగా ఆడని మిల్లర్.. చివరి నిమిషంలో షాట్ మార్చడానికి ప్రయత్నించాడు.
విఫలం అవడంతో బంతి గాల్లోకి లేచింది. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న రుతురాజ్ పైనుంచి బంతి వెళ్తుండగా.. అతను గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో మిల్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. 11 ఓవర్లు ముగిసే సరికి సఫారీలు 5 వికెట్ల నష్టానికి 71 పరుగులతో నిలిచారు.