తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు చేయడం కష్టంగా మారిన తరుణంలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన లుంగి ఎన్గిడీ.. బౌలింగ్‌లో కవర్స్ దిశగా షాట్ ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు.
అయితే ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్‌లో ఉన్న సఫారీ కెప్టెన్ ఎల్గార్ చేతులకు చిక్కింది. దీంతో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ పెవిలియన్ చేరాడు. 54 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటవడంతో కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.
ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో సెంచరీతో రాహుల్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో పుజారా గోల్డెన్ డక్‌గా మొదటి బంతికే అవుటవగా.. కోహ్లీ 35 పరుగులు చేశాడు.
KL Rahul caught slashing outside off
— All About Cricket (@AllAboutCricke8) December 29, 2021
Rahul c Elgar b Ngidi 23
India 54/3#INDvsSA #SAvsIND #CricketTwitter pic.twitter.com/TV9VahMtit