మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఎయిడెన్ మార్క్రమ్ను షమీ అవుట్ చేశాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయడానికి మార్క్రమ్ ప్రయత్నించాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది.
అక్కడ కాచుకు కూర్చున్న రాహుల్ క్యాచ్ పట్టేశాడు. దీంతో జట్టు స్కోరు 23 పరుగుల వద్ద మార్క్రమ్ (16) పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో మార్క్రమ్ను అత్యధికసార్లు అవుట్ చేసిన బౌలర్ షమీనే. అంతకుముందు బంతి కూడా అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది.
కానీ థర్డ్ స్లిప్‌కు చాలా దూరంగా వెళ్లడంతో దాన్ని ఎవరూ అందుకోలేకోయారు. అది ఫోర్ వెళ్లింది. ఆ తర్వాతి బంతికే తన లైన్ అండ్ లెంగ్త్ సరిచేసుకున్న షమీ.. వికెట్ తీశాడు. దీంతో ఫామ్‌లో ఉన్న కీగన్ పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు భారత బ్యాటర్లలో పంత్ (100 నాటౌట్) తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు.
కోహ్లీ (29) మంచి ఇన్నింగ్సే ఆడినా కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించి ఎప్పట్లాగే అవుటయ్యాడు. దీంతో భారత జట్టు 198 పరుగులకు ఆలౌట్ అయింది. సఫారీల ముందు 212 పరుగుల టార్గెట్ నిలిపింది.