వాండరర్స్ టెస్టులో సఫారీల టార్గెట్ సెట్ అయింది. రెండో ఇన్నింగ్సులో పుజారా (53), రహానే (58) రాణించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత్.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో సఫారీల ముందు భారీ టార్గెట్ ఉంచలేకపోయింది.
హనుమ విహారి (40 నాటౌట్) ఆకట్టుకున్నప్పటికీ.. చివర్లో అతనికి సహకరించే వాళ్లు లేకపోయారు. సిరాజ్ (0)ను అవతలి ఎండ్లో ఉంచి కొంత సేపు పోరాడిన విహారి.. ఇన్నింగ్స్ 60వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండో బౌండరీలు బాదాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే సిరాజ్ను ఎన్గిడీ బౌల్డ్ చేశాడు. దీంతో 266 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.
సఫారీల ముందు 240 పరుగుల టార్గెట్ నిలిచింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (23), పుజారా (53), రహానే (58), విహారి (40 నాటౌట్), పంత్ (0), అశ్విన్ (16), శార్దూల్ ఠాకూర్ (28), షమీ (0), బుమ్రా (7), సిరాజ్ (0) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 3, రబాడ 3, ఎన్గిడీ 3 వికెట్లు తీయగా.. ఆలివియర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.