సౌతాఫ్రికా పేసర్లు చెలరేగిన పిచ్‌పై తానేమీ తక్కువ కాదని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిరూపించాడు. సఫారీ పేసర్ల ధాటికి భారత జట్టు 327 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ వెంటనే బరిలో దిగిన సౌతాఫ్రికాకు బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు.
ఆ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్‌ను ఓవర్ ఐదో బంతికి పెవిలియన్ చేర్చాడు. ఎల్గార్ బ్యాట్‌కు అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ రిషభ్ పంత్ సులభంగా అందుకున్నాడు. దీంతో సఫారీలు రెండు పరుగులకే తొలి వికెట్ కోల్పోయారు. ఎల్గార్ (1) అవుటవడంతో కీగన్ పీటర్సన్ క్రీజులోకి వచ్చాడు. ఎయిడెన్ మార్క్రమ్ మరో ఎండ్‌లో ఉన్నాడు.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి 272/3తో నిలిచిన భారత జట్టు.. ఎన్గిడీ, రబాడ విజృంభించడంతో ఆ స్కోరుకు కేవలం 55 పరుగులు మాత్రమే జోడించగలిగింది. 15 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు ప్రభావం చూపడంలో విఫలమయ్యారు. దీంతో 327 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.
Just the start India needed!
— ICC (@ICC) December 28, 2021
Jasprit Bumrah removes Dean Elgar in the first over for 1.#WTC23 | #SAvIND | https://t.co/fMLQOADpkL pic.twitter.com/w1sENrzXAR