సఫారీ టూర్లో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించిన అంశాల్లో బుమ్రా వర్సెస్ జాన్సెన్ ఫైట్ ఒకటి. రెండో టెస్టులో జాన్సెన్ వేసిన బౌన్సర్ బుమ్రాకు తగిలింది. ఈ సందర్భంగానే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఆ తర్వాత జాన్సెన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది.
అయితే కేప్‌టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్సలో మహమ్మద్ షమీ వరుసగా రెండు వికెట్లు తీయడంతో జాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. రెండో టెస్టులో గొడవ తర్వాత జాన్సెన్కు బుమ్రా బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. దీంతో కొన్ని బౌన్సర్లు వేసిన బుమ్రా.. జాన్సెన్కు తన ఉద్దేశ్యం స్పష్టంచేశాడు.
అయితే వెంటనే తలొగ్గని జాన్సెన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. కానీ టీ బ్రేక్‌కు ముందు బుమ్రా బౌలింగ్‌లోనే జాన్సెన్ పెవిలియన్ చేరాడు. సఫారీల ఇన్నింగ్స్ 63వ ఓవర్ రెండో బంతికి జాన్పెన్ను బోల్తా కొట్టించిన బుమ్రా అతన్ని అవుట్ చేశాడు.
బుమ్రా వేసిన బంతిని జాన్సెన్ మిస్ అవడంతో, అది నేరుగా వెళ్లి ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అంపైర్లు టీ బ్రేక్ ఇచ్చారు. సఫారీ జట్టు 176/7తో భారత స్కోరుకు మరో 47 పరుగులు వెనుకపడి ఉంది.
Bumrah vs Jansen #bumrah #Jansen #INDvsSA #Bowling_King #bowling pic.twitter.com/ZAy2KWVWEv
— Gur (@Gursohavi) January 12, 2022
Some heat between Jasprit Bumrah and Marco Jansen. pic.twitter.com/vRWswSt2NJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2022