వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ నుంచి అందుతున్న సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్న భువీ.. సఫారీలకు మరో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4)ను పెవిలియన్ చేర్చిన అతను.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన ప్రిటోరియస్ (4)ను కూడా అవుట్ చేశాడు.
భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన ప్రిటోరియస్.. ఆ తర్వాత సరైన షాట్ ఆడలేకపోయాడు. వరుసగా మూడు డాట్ బాల్స్ పడటంతో ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో భువీ వేసిన నకుల్ బాల్‌ను స్లాగ్ చేసి బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. బంతి స్లోగా రావడంతో అతని అంచనా తప్పింది. దీంతో ఆవేష్ ఖాన్‌కు సులభమైన క్యాచ్ దక్కింది. దీంతో సఫారీ జట్టు 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.