పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ (12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాతిన అతను.. చివరి బంతికి కూడా సిక్సర్ బాదడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో సరిగా కనెక్ట్ చెయ్యలేకపోవడంతో లాంగాఫ్‌లో ఉన్న ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 8 ఓవర్లలో 50/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే అదే తరహా షాట్ ఆడబోయిన విరాట్ కోహ్లీ (35) కూడా అవుటయ్యాడు. కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లో అహ్మద్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.