దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్‌ను ఆడటంలో అహ్మద్ విఫలమయ్యాడు. దాంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ కార్తీక్ జంప్ చేసి అందుకోవడంతో అహ్మద్ పెవిలియన్ చేరాడు. దీంతో 87 పరుగుల వద్ద పాక్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.