IND vs NZ : టీమిండియా స్కోర్ 313 వద్ద వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాడు. దాంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. టిక్నర్ ఓవర్లో షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందు జాకబ్ డఫె కోహ్లీ, సూర్య వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. కివీ ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ పరుగులతో క్రీజులో ఉన్నారు. 42ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్.. 319/6 కోహ్లీ, ఇషాన్, సూర్య వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో స్కోర్ వేగం తగ్గింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టు దిట్టంగా బంతులు వేస్తున్నారు.