IND vs NZ : ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ బాదాడు. 145 బంతుల్లోనే అతను రెండొందలు సాధించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. తన కళాత్మక షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. దాంతో భారత్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. అంతకుముందు గిల్ సిక్సర్‌తో 150కి చేరువయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు.