జైపూర్: న్యూజిల్యాండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతున్నారు. 165 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (15), రోహిత్ శర్మ (43 నాటౌట్) అదిరిపోయే ఆరంభాన్నందించారు. వీరి ధాటికి 5 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది.
కానీ ఆరో ఓవర్ తొలి బంతికే రాహుల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (22 నాటౌట్)తో కలిసి రోహిత్.. మరో వికెట్ పడకుండా ఆడుతున్నాడు. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి భారతజట్టు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది.