IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
IND vs NZ | న్యూజిలాండ్ పర్యటన (New Zealand Tour) లో వరుసగా మూడు టీ20లు గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా (Team India) సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (శుక్రవారం) రెండుజట్ల మధ్య ఆక్లాండ్ (Auckland) లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది.
IND vs NZ : న్యూజిలాండ్ పర్యటన (New Zealand Tour) లో వరుసగా మూడు టీ20లు గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీమిండియా (Team India) సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడిక సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (శుక్రవారం) రెండుజట్ల మధ్య ఆక్లాండ్ (Auckland) లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పుడు శ్రేయాస్ సేన మరో గెలుపుపై కన్నేసింది. మరోవైపు సొంతగడ్డపై వైట్‌వాష్‌ను తప్పించుకోవడానికి న్యూజిలాండ్ సిద్ధమైంది.
గాయంతో రెండో టీ20కి దూరమైన వికెట్ కీపర్బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో టీ20 కూడా ఆడలేదు. నాలుగో టీ20లో కూడా ఇషాన్ ఆడే అవకాశాలు కనిపించడంలేదని, గత రెండు మ్యాచ్‌లలో ఆడిన తుదిజట్టునే కొనసాగిస్తారని తెలుస్తున్నది. మరి ఓపెనర్లు అభిషేక్, వైభవ్‌లను ఆపేందుకు కివీస్ బౌలర్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సంజు శాంసన్, తిలక్ వర్మ, నమన్ ధీర్ కూడా మంచి ఊపులో ఉన్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యరే ఇంకా న్యూజిలాండ్ పర్యటనలో తన ధాటి చూపించలేదు.
ప్రధాన పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్ దూరం కావడంతో కివీస్ పేస్ విభాగం తేలిపోతోంది. అయితే కెప్టెన్, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మాత్రం గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులిస్తుంటే అతను కట్టడిచేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. మరి భారత బ్యాటర్లు శాంట్నర్ ఉచ్చును ఈ మ్యాచ్‌లో ఛేదిస్తారేమో చూడాలి. భారత బౌలర్లు అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్ పిచ్‌లకు తగ్గట్లు బంతులేస్తూ కివీస్ భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయగలుగుతున్నారు.
ఆల్‌రౌండర్లు నితీశ్‌కుమార్, నమన్ ధీర్ కూడా పర్వాలేదనిపిస్తుండగా నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ విఫలమవుతున్నాడు. అతను తొలి మూడు మ్యాచ్‌లలో కలిపి ఒక్క వికెటే తీశాడు. దాదాపు 12 ఎకానమీతో పరుగులిచ్చాడు. చివరి రెండు మ్యాచ్‌లలో రాణించకపోతే భువికి తర్వాతి సిరీస్‌లో అవకాశం దక్కడం కష్టమవుతుంది. ఈ స్థితిలో అతనేం చేస్తాడనే చూడాల్సి ఉంది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, మిచెల్, ఫిలిప్స్, జాకబ్స్ల రూపంలో కివీస్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.
ఇదిలావుంటే ఆక్లాండ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ బౌండరీ హద్దులు చిన్నగా ఉంటాయి. కాబట్టి సిక్సర్ల మోత మోగడం ఖాయం. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ ఒక వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో 150వ వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. కివీస్ కెప్టెన్ శాంట్నర్ కూడా 150 వికెట్ల మైలురాయికి ఒక్క వికెట్ దూరంలోనే ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
KTR | తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు.. మొన్న ఈనాడు.. నేడు సురేఖ క్షమాపణలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
Revanth Reddy | కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్ సమ్మిట్ పేరిట ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు!
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

