రాంచీ: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు మార్టిన్ గప్తిల్ (15 బంతుల్లో 31), డారియల్ మిచెల్ (16 నాటౌట్) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత బౌలర్లపై గప్తిల్ ఎదురుదాడికి దిగాడు.
తొలి ఓవర్లో అతను ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ అందుకోలేకపోయాడు. దీంతో రెచ్చిపోయిన అతను ఎడాపెడా బౌండరీలు బాదాడు. అయితే గప్తిల్ వేగానికి చాహర్ కళ్లెం వేశాడు. షార్ట్ పిచ్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన గప్తిల్ విఫలమయ్యాడు. దీంతో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.