ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పిన హార్దిక్.. ఉమ్రాన్ మాలిక్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తున్నాడు. అతను జెర్సీ నెంబర్ 98తో బరిలో దిగుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మ్యాచ్ ఆరంభంలో లైట్‌గా వర్షం పడుతోందని, కావున మ్యాచ్ కొంత ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్
ఐర్లాండ్ జట్టు: ఆండీ బాల్బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, గారెగ్ డెలనీ, హారీ టెక్టార్, లార్కాన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, కానర్ ఓల్ఫెర్ట్
A dream come true moment!!Congratulations to Umran Malik who is all set to make his T20I debut for #TeamIndia
He gets 🧢 No.98 #IREvIND pic.twitter.com/8JXXsRJFbW
— BCCI (@BCCI) June 26, 2022