హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. రెండో ఓవర్లో బంతి అందుకున్న అతను చివరి బంతికి యాసిం ముర్తాజా (9)ను అవుట్ చేశాడు. ఆ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన యాసిం.. అర్షదీప్ వేసిన బౌన్సర్‌ను అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో అతను ఆడిన పుల్‌షాట్ విఫలమై టాప్ ఎడ్జ్ తీసుకుంది. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆవేష్ ఖాన్ ఆ క్యాచ్‌ను చక్కగా అందుకోవడంతో హాంగ్‌కాంగ్ జట్టు 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.