Virat Kohli | భారత్ – ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై వస్తున్న సందేహాలను తోసిపుచ్చాడు. రెండో వన్డేలో జట్టులోకి తిరిగి వస్తాడని తెలిపాడు. గత మ్యాచ్‌లో కుడి మోకాలి వాపు కారణంగా ఇంగ్లాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు దూరైన విషయం తెలిసిందే. కోహ్లీ గాయపడ్డాడన్న వార్త భారత జట్టును ఆందోళనకు గురి చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దుబాయి వెళ్లనున్నది. ఐసీసీ ఈవెంట్‌కు సన్నాహకంగా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఉపయోగపడనున్నది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో 87 పరుగులు చేయగా.. భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓ చానెల్‌తో గిల్ మాట్లాడుతూ.. కోహ్లీకి అయిన గాయం అంత తీవ్రమైంది కాదని.. బుధవారం బాగానే ప్రాక్టీస్ చేశాడని.. గురువారం ఉదయం మోకాలు వాచిందని తెలిపాడు.
రెండో వన్డే తుది జట్టులో చేరుతాడని తెలిపాడు. తాను సెంచరీని దృష్టిలో ఉంచుకుని ఆడటం లేదని చెప్పాడు. సెంచరీ గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టి.. తదనుగుణంగా షాట్లు ఆడుతున్నానని.. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. వాస్తవానికి గిల్ వన్డేలో ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తుండగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నెంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తనకు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఎలాంటి సమస్య లేదని.. పెద్దగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. నంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా సవాల్‌తో కూడుకున్నదని.. పరిస్థితికి అనుగుణంగా ఆడాలని చెప్పాడు. వికెట్లు కోల్పోతే జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని గిల్ పేర్కొన్నాడు. జట్టుకు మంచి ఆరంభం లభిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని..మ్యాచ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆడుతానని చెప్పాడు.