Michael Vaughan | భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతున్నది. ఈ మ్యాచ్ ప్రస్తుతం రసవత్తరంగా మారింది. విజయం కోసం ఐదోరోజు ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ నాలుగు వికెట్లు తీస్తే విజయం దక్కుతుంది. టీమిండియా ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటముగిసే సరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరమయ్యాడు. అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, పోప్‌కు కాకుండా హ్యారీ బ్రూక్‌కు కెప్టెన్సీ అప్పగించాల్సిందని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హ్యారీ బ్రూక్ 98 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 111 పరుగులు చేశాడు. జో రూట్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్‌ను విజయానికి చేరువ చేశాడు. బ్రూక్ 19 పరుగుల వద్ద ఉన్న సమయంలో అతని లైఫ్ వచ్చింది. సిరాజ్ క్యాప్ పట్టి బౌండరీ రోప్‌ను తాకడంతో అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బ్రూక్ తన టెస్ట్ కెరీర్లో పదో సెంచరీని చేశాడు. స్టోక్స్ అందుబాటులో లేని సమయంలో కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సిరీస్‌లో పోప్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. చివరి టెస్టులో 22, 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సిరీస్‌లోని తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 34 సగటుతో 306 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ సహజంగానే నాయకత్వ లక్షణాలున్నాయని.. స్టోక్స్ అందుబాటులో లేకపోతే అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ కెప్టెన్ సూచించాడు.