IND vs ENG 5th Test | భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు పర్యటన ముగింపునకు వచ్చింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్టులు ముగియగా.. 3 – 1 తేడాతో బెన్ స్టోక్స్ సేన సిరీస్ కోల్పోయింది. ధర్మశాల వేదికగా రేపటి (మార్చి 7, గురువారం) నుంచి జరుగబోయే ఐదో టెస్టుకు గాను ఇంగ్లండ్.. తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రాంచీలో ఆడిన ఓలీ రాబిన్సన్ను పక్కనబెట్టిన ఇంగ్లండ్.. మార్క్‌వుడ్‌ను జట్టులో చేర్చింది.
ఈ సిరీస్‌లో మార్క్ వుడ్ పరిస్థితి మ్యూజికల్ చైర్‌లా మారింది. తొలి టెస్టులో ఆడిన వుడ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడంతో రెండో టెస్టుకు అతడిని పక్కనబెట్టింది. మళ్లీ రాజ్‌కోట్ టెస్టులో ఆడిన వుడ్.. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో నాలుగో టెస్టులో అతడికి విశ్రాంతినిచ్చి ఓలీ రాబిన్సన్ను జట్టులో చేర్చింది. రాబిన్సన్ రాంచీ టెస్టులో బ్యాటింగ్‌తో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఐదో టెస్టులో ఇంగ్లండ్ అతడిని పక్కనబెట్టి మళ్లీ మార్క్‌వుడ్‌కు పిలుపు అందించింది. రాంచీలో మాదిరిగానే ఇద్దరు పేసర్లు (అండర్సన్, వుడ్) ఇద్దరు స్పిన్నర్ల (హర్ట్లీ, బషీర్)లతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది.
ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో పరువు కోసం బరిలోకి దిగనుంది. బజ్‌బాల్ ఆటతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచిన ఆ జట్టు భారత్‌లో మాత్రం విఫలమైంది. స్పిన్‌తో పాటు బుమ్రా పేస్‌కు దాసోహైన బజ్‌బాల్.. తొలి టెస్టులో మినహా మిగిలిన మూడు టెస్టులలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది.
A special week ahead 🏏
The opportunity to do our thing against a backdrop like this 🙌 #INDvENG | #EnglandCricket pic.twitter.com/v9HvQxRRR5
— England Cricket (@englandcricket) March 5, 2024
ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హర్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్