IND vs ENG 4th Test | టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచిన అశ్విన్.. తాజాగా రాంచీ టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను ఔట్ చేయగానే ఆ జట్టుపై టెస్టులలో వంద వికెట్లు సాధించాడు. ఈ వికెట్ తీయడం ద్వారా అతడు.. ఇంగ్లండ్‌పై వంద వికెట్లు తీయడంతో పాటు వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. ఆల్‌రౌండ్ రికార్డుతో అదరగొట్టిన అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో ఆటగాడు కాగా భారత్ నుంచి ఒకే ఒక్కడిగా నిలిచాడు.
టెస్టులలో అశ్విన్.. బౌలింగ్‌లో వంద వికెట్లు తీయడమే గాక బ్యాట్‌తో 1,085 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో 23వ టెస్టు ఆడుతున్న అశ్విన్.. వంద వికెట్ల క్లబ్‌లోనూ చేరాడు. వంద వికెట్లలో 86 వికెట్లను సొంతగడ్డలోనే తీయగా 14 వికెట్లను ఇంగ్లండ్ గడ్డమీద పడగొట్టాడు. ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్స్‌లో జేమ్స్ అండర్సన్ (145) తర్వాత స్థానంలో నిలిచాడు. టెస్టులలో అశ్విన్.. ఇంగ్లండ్ పైనే గాక ఆస్ట్రేలియాపైనా 114 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్లో వంద వికెట్లు, వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్లు..
జార్జ్ జిఫెన్ – 1,238 పరుగులు, 103 వికెట్లు (ఇంగ్లండ్‌పై)
మోంటీ నోబుల్ – 1,905 పరుగులు, 115 వికెట్లు (ఇంగ్లండ్‌పై)
విల్ఫ్రెడ్ రోడ్స్ – 1,706 పరుగులు, 109 వికెట్లు (ఆసీస్‌పై)
గ్యారీ సోబర్స్ – 3,214 పరుగులు, 102 వికెట్లు (ఇంగ్లండ్‌పై)
ఇయాన్ బోథమ్ – 1,673 పరుగులు, 148 వికెట్లు (ఆసీస్‌పై)
స్టువర్ట్ బ్రాడ్ – 1,019 పరుగులు, 153 వికెట్లు (ఆసీస్‌పై)
రవిచంద్రన్ అశ్విన్ – 1.085 పరుగులు, 100 వికెట్లు (ఇంగ్లండ్‌పై)
Ashwin is now one of seven men with the all-round Test double against an opponent 🤌 pic.twitter.com/RrgO6ZUW9K
— ESPNcricinfo (@ESPNcricinfo) February 23, 2024