IND vs BAN : బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ఔటయ్యాడు. సిరాజ్ వేసిన 7.3వ ఓవర్లో శార్థూల్ ఠాకూర్ క్యాచ్ పట్టడంతో లిట్టన్ నిరాశగా వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. అనాముల్ ఔటయ్యాక షకిబుల్తో కలిసి భాగస్వామ్యం నిర్మించే క్రమంలో లిట్టన్ వేగంగా ఆడాలనుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సీనియర్ ఆల్రౌండర్ షకిబుల్ హసన్ 23, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం 3 పరుగులతో ఆడుతున్నారు.
మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 409 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ (204) సాధించాడు. విరాట్ కోహ్లీ (113) కూడా సెంచరీతో చెలరేగాడు. చివర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (20 రన్స్) , వాషింగ్టన్ సుందర్ (37 పరుగులు) ధాటిగా ఆడారు.