Rohit Sharma | బంగ్లాదేశ్‌తో భారత జట్టు రెండు మ్యాచులు ఆడబోతున్నది. ఈ నెల 19న తొలి టెస్ట్ చెన్నైలోని ఎం చిదరంబరం స్టేడియంలో ప్రారంభంకానున్నది. రెండోటెస్ట్ కాన్పూర్ వేదికగా జరుగనున్నది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి పని చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, గంభీర్‌కు మధ్య తేడాలను తెలిపాడు. ద్రవిడ్ కోచింగ్ శైలికి, గంభీర్ కోచింగ్ తీరులో తేడాలున్నాయని చెప్పారు. గంభీర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని హిట్‌మ్యాచ్ చెప్పుకొచ్చాడు. మంగళవారం మీడియాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్, పరాస్ మాంబ్రే ఓ భిన్నమైన జట్టు, కొత్త సహాయక సిబ్బంది భిన్నమైన విధానాన్ని తీసుకురావడం ఆమోదయోగ్యమైందేనని చెప్పాడు. కొత్త కోచింగ్ స్టాఫ్ స్టయిల్ వేరుగా ఉన్న సమస్యలేదని చెప్పాడు.
మంచి అవగాహన కలిగి ఉండడం ముఖ్యమని చెప్పాడు. కోచ్‌గా గౌతమ్ గంభీర్ జులైలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీమిండియా తొలి టెస్ట్ సిరీస్ ఆడబోతున్నది. భారత జట్టు చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ఆడింది. మళ్లీ సుదీర్ఘ విరామం అనంతరం జట్టు టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నది. మ్యాచ్‌కు చాలా సమయం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండగా..? ఈ విరామం ఆటపై ప్రభావం చూపుతుందా? అని హిట్‌మ్యాన్‌ని ప్రశ్నించగా.. పెద్దగా ప్రభావం చూపదని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు ఇలాగే జరిగిందని.. పరిస్థితి అనుగుణంగా సులభంగా మారుతూ వస్తామని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. చాలాకాలం తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో బీసీసీఐ చెన్నైలో చిన్న క్యాంప్‌ని ఏర్పాటు చేసింది. చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆటగాళ్లంతా దులీప్ ట్రోఫీలో ఆడేందుకు చెన్నైకి చేరుకున్నారు.