IND vs AUS Weather Report | బోర్డర్ గవాస్కర్ టెస్ సిరీస్‌లో భాగంగా బిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తడబడింది. నాలుగో రోజు మ్యాచ్ ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అయితే, బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్ జోడి ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని నిలబడడంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. అయినా, ఆసిస్ కంటే 193 పరుగులు ఇంకా వెనుకపడి ఉంది. మ్యాచ్ ముగిసే సరికి ఆకాశ్ దీప్ 27 పరుగులు, బుమ్రా 10 పరుగులతో నాటౌట్ నిలిచారు.
భారత్ 2013 పరుగుల వద్ద రవీంద్ర జడేజా రూపంలో తొమ్మిది వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో టీమిండియాకు ఫాలో ఆన్ ముప్పు పొంచి ఉంది. అయితే, మరో వికెట్ పడకుండా టీమిండియా బ్యాటర్లు బుమ్రా, ఆకాశ్ దీప్ అడ్డుకున్నారు. ఆకాశ్ దీప్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో టీమిండియా ఫాలో ఆన్ నుంచి బయటపడేందుకు 33 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరూ ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ఎదుర్కొన్నారు. ఆకాశ్-బుమ్రా జోడీ పదో వికెట్‌కు ఇప్పటి వరకు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో టీమిండియా ఫాలో ఆన్ నుంచి బయటపడింది. నాలుగో రోజు సాగిన ఆటలో టీమిండియా 192 పరుగులు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌కు పలుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. కేవలం 58 ఓటర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఇక వెదర్ రిపోర్ట్‌ని పరిశీలిస్తే.. బుధవారం సైతం వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మ్యాచ్ సాగేందుకు అవకాశం ఉండదు. ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ మ్యాచ్ సమయంలో వర్షం పడేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం చాలా వర్షం కురిసే సూచనలున్నాయని.. పలుచోట్ల భారీ పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక మ్యాచ్ చివరి రోజున 98 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టు రిస్క్ చేయాలని భావిస్తే.. భారత్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీలైనంత వరకు వేగంగా పరుగులు చేసి.. ఆ తర్వాత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాలి.
ఐదో రోజు మ్యాచ్ అరగంట ముందే మొదలయ్యే అవకాశం ఉంది. అది కూడా వరుణుడు కరుణిస్తేనే. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా టీమ్‌కు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్ని తెలియదు. ఈ పరిస్థితుల్లో భారత్‌కు ఆస్ట్రేలియా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించలేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక చివరి రోజు వర్షం ఆటంకం కలిగించినా మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు ఖాయంగా కనిపిస్తున్నది.