IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు తేలిపోతున్నారు. నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టులో మరోసారి టాప్ ఆర్డర్ విఫలమైంది. కీలకమైన మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. బుమ్రా నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగింది. బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి సెషన్ ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
ముగ్గురు కీలకమైన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరడంతో మళ్లీ టీమిండియా కష్టాల్లో పడింది. లంచ్ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (12) క్రీజులో ఉన్నాడు. లంచ్‌కు ముంతు నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి గిల్ అవుట్ అయ్యాడు. కేవలం 20 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. మూడో వికెట్‌కు కోహ్లీతో కలిసి గిల్ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (10), మిచెల్ స్కార్ట్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (4) అవుట్ అయ్యారు.