IND vs AUS T20 | బ్యాడ్ వెదర్‌తో నిలిచిన టీ20 మ్యాచ్.. 4.5 ఓవర్లలో టీమిండియా 52 రన్స్
IND vs AUS T20 | ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగగా.. టీమిండియా తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.
IND vs AUS T20 | ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగగా.. టీమిండియా తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. టాస్ బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. 4.5 ఓవర్లలో టీమిండియా వికెట్ల నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాడ్ వెదర్ కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ 13 బంతుల్లో 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా బ్యాటర్లకు రెండుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ ఫైన్ లెగ్మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బెన్ ద్వార్షుయిస్ చేతుల్లో పడి జారిపోయింది. ఆ సమయంలో అభిషేక్ స్కోర్ 11. అంతకు ముందు బెన్ ద్వార్షుయిస్ ఓ ఓవర్లో నాలుగో బంతికి అభిషేక్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, బంతి ఎక్కువ దూరం వెళ్లకుండా.. ఎత్తుకు వెళ్లి మిడ్-ఆఫ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ చేతుల్లోపడినట్లే పడి జారిపోయింది. దాంతో రెండుసార్లు అభిషేక్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

