IND vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న డే-నైట్ టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్నది. ఇప్పటికే ఓపెనర్లు ఇద్దరు అవుట్ అవగా.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వికెట్‌ను సైతం టీమిండియా కోల్పోయింది. 66 పరుగుల వద్ద విరాట్ (11) స్కోట్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో.. అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 70కిపైగా పరుగులు వెనుకపడి ఉన్నది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 337 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (28), రిషబ్ పంత్ (7) బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియాలో బౌర్లలో బోలాండ్కు 2 వికెట్ల, కమ్మిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.