Mohammad Siraj | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్ మహ్మద్ సిరాజ్ 2.90 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లుగా చూపుతున్న వీడియో వైరల్ అవుతున్నది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్లోని నాల్గవ బంతిని మహ్మద్ సిరాజ్ బౌల్ చేశాడు. స్క్రీన్‌పై బ్రాడ్‌కాస్టర్ బంతి వేగాన్ని 181.6 కిమీ వేగంతో వేసినట్లుగా చూపించగా.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత బౌలర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడని అభిమానులు భావించారు. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. పొరపాటున స్క్రీన్‌పై బౌలింగ్ స్పీడ్ కనిపించింది. అత్యంత వేగంగా బంతిని విసిరిన ప్రపంచ రికార్డు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్నది. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 161.3 కిలోమీటర్ల వేగంతో అక్తర్ బంతిని విసిరాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సిరాజ్ వేసిన బంతి స్పీడ్ ఇంతకంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో సిరాజ్.. షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడని భావించారు. బ్రాడ్‌కాస్టర్ పొరపాటు వల్ల డిస్ప్లే అయ్యింది. ఇక ఇదిలా ఉండగా.. ఓ ఓవర్లో మార్నస్ లాబుషాగ్నే బ్యాటింగ్ చేస్తుండగా.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ వేశాడు. సిరాజ్ తన ఓవర్ చివరి బంతిని వేయడానికి సిద్ధమయ్యాడు. రన్ అప్ తీసుకోగా.. ఆ సమయంలో బ్యాటర్ లాబుస్చాగ్నే.. సైట్ స్క్రీన్ ముందు నుంచి ఓ వ్యక్తి వెళ్తుడడంతో ఏకాగ్రత కోల్పోయాడు. ఆ తర్వాత లబుషాగ్నే వెనక్కి తగ్గడంతో సిరాజ్ ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో అతని వైపు బంతిని విసురుతూ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగులు చేసింది.
• Man runs behind the sight screen with a beer snake
• Marnus pulls away while Siraj is running in
• Siraj is not happyAll happening at Adelaide Oval 🫣 #AUSvIND pic.twitter.com/gRburjYhHg
— 7Cricket (@7Cricket) December 6, 2024