భారత్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (23)ను భువీ పెవిలియన్ చేర్చాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు. ఆఫ్‌స్టంప్‌నకు కొంచెం ఆవలగా భువీ వేసిన బంతిని లాంగాన్ మీదుగా ఆడేందుకు మ్యాక్స్‌వెల్ ప్రయత్నించాడు.
అయితే దాన్ని అతను సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ దినేష్ కార్తీక్ వైపు వెళ్లింది. డీకే సులభంగా క్యాచ్ పట్టేయడంతో మ్యాక్సీ నిరాశగా మైదానం వీడాడు. దీంతో ఆసీస్ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులతో నిలిచింది.