నాగ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ (15 బంతుల్లో 31)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన యాంగ్లింగ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన ఫించ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు ఆస్ట్రేలియా 46/4 స్కోరుతో నిలిచింది.