IND vs AUS : టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. కుహ్నేమాన్ ఓవర్లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో క్లిష్ట సమయంలో ఈ ఆల్‌రౌండర్ సాధికారిక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అక్షర్, రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించారు. వీళ్లిద్దరూ 91 రన్స్ జోడించారు. అశ్విన్ 31 రన్స్‌తో ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రీకర్ భరత్ ఔటయ్యాక అక్షర్, అశ్విన్ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు. 139 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కొల్పోయింది. అక్షర్‌తో జత కలిసిన అశ్విన్ ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం భారత్ 33 రన్స్ వెనకబడి ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 230/7.
భారత్‌పై ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. శ్రీకర్ భరత్‌ను ఔట్ చేసి లయాన్ ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా లయాన్ రికార్డు సాధించాడు. భారత లెజెండ్ అనిల్ కుంబ్లే 10 సార్లు ఐదు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (7సార్లు) మూడో స్థానంలో నిలిచాడు.