IND vs AUS | స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత జట్టు మూల్యం చెల్లించిందన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆ ఓటమి నుంచి భారత్ తప్పక కోలుకుంటోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ గర్వించే ఇది జట్టు అన్నారు. జట్టు నిరాశకు గురవుతున్నదని.. త్వరలోనే దాన్ని నుంచి బయటపడుతుందన్నారు. ఆ సిరీస్ నుంచి తిరిగి బయటపడేందుకు ప్రారంభ మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడటమేనన్నారు.
ఈ పరిస్థితిలో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు చాలా కీలకమవుతాయన్నారు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 22 నుంచి మొదలవనుండగా.. పెర్త్ స్టేడియంలో మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆటగాళ్ల మనస్తత్వం బాగుండేలా చూడాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ప్రారంభం ఘనంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆటగాళ్లను మానసిక స్థితి బాగుండాలని.. ఇది కోచ్‌కు కీలకమవుతుందన్నారు. 2018-19, 2020-21 సిరీస్ విజయాల సమయంలో శాస్త్రి భారత హెడ్‌కోచ్‌గా కొనసాగారు. గత విజయాలను భారత ఆటగాళ్లు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ఉంటూ.. సానుకూల అంశాలపై ఆలోచించాలని టీమిండియాకు సూచించారు. ఇటీవల ఫలితాలను పక్కనపెట్టి.. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సాధించిన విజయాలపై దృష్టి పెట్టాలన్నారు.