AUS Vs IND ODI | ఆస్ట్రేలియా-భారత్ మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం ఇబ్బంది పెట్టింది. నాలుగుసార్లు అడ్డు తగలడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు ఇబ్బందిపడ్డారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 26 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 131 పరుగుల చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఇక అడిలైడ్ వేదికగా గురువారం రెండో వన్డే మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు సైతం వర్షం ఆటంకం కలిగిస్తుందా? పూర్తి 50 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్‌ను కాపాడుకోవాలనుకుంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలువడం కీలకం. అడిలైడ్ ఓవల్‌లో వర్షం ఆటకు ఆటంకం కలుగకూడదని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఆశిస్తున్నది. శుభవార్త ఏమిటంటే అడిలైడ్‌లో వర్షం పడే అవకాశం లేదని వాతావరణశాఖ అప్డేట్ ఇచ్చింది. మ్యాచ్‌కు ముందురోజు బుధశారం వర్షం పడే అవకాశం 20శాతం మాత్రమే ఉందని చెప్పింది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం చాలా తక్కువగానే ఉన్నాయి.
పెర్త్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ పదే పదే నిలిచిపోయింది. అడిలైడ్‌లో ఈ పరిస్థితి ఉండదని, అభిమానులు పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌ను ఆస్వాదించొచ్చు. అడిలైడ్ ఓవల్ పిచ్ బ్యాటింగ్ కోసం ఆస్ట్రేలియాలో అత్యుత్తమమైన పిచ్‌లలో ఒకటి. ఇది కొంత బౌన్స్‌తో కూడిన ఫ్లాట్ పిచ్. బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయడం సులభమే. అడిలైడ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పిచ్. భారత్ స్పిన్ పటిష్టంగా ఉంది. సిరీస్‌ను సమం చేయడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు.