IND Vs PAk | భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగాల్సిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ రద్దయ్యింది. భారత ఆటగాళ్లు తాము టోర్నీ నుంచి ఆడబోమని ప్రకటించిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరల్డ్ చాంపియన్‌షిప్ మేనేజ్మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్‌తో మ్యాచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మే 11న తాను తీసుకున్న స్టాండ్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపాడు. నా దేశమే తనకు సర్వస్వమని.. తన దేశం కంటే ఏదీ గొప్పకాదు అని పేర్కొన్నాడు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే.
శిఖర్ ధవన్‌తో సహా సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ సహా పలువురు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు. అయితే, భారత్-పాక్ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని జట్టుకు ఇదే తొలిమ్యాచ్. భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దీనిపై నిర్వాహకులు స్పందిస్తూ.. ఇటీవల ఇరుదేశాల మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ చేసినట్లు డబ్ల్యూసీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరింది.