లాహోర్ : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి మొదలైన తొలి టెస్టులో పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) సెంచరీ చేజార్చుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (62*), సల్మాన్ అఘా (52*) రాణించడంతో మొదటి రోజు ఆట చివరికి పాక్.. 90 ఓవర్లలో 313/5తో నిలిచింది. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన బాబర్ ఆజమ్ (23) మరోసారి నిరాశపరిచాడు.