Umran Malik : ఫాస్ట్ బౌలర్లలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ అక్తర్ పేరు వింటే ఒకప్పుడు బ్యాటర్లు హడలెత్తి పోయేవాళ్లు. ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. బౌన్సర్లు సంధిస్తూ వికెట్లు సాధించేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌గా అక్తర్ రికార్డు సాధించాడు. అయితే.. అదృష్టం కలిసి రావాలేగానీ తాను అక్తర్ వేగవంతమైన బంతి రికార్డును తాను బ్రేక్ చేస్తానని టీమిండియా యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. ‘నేను పూర్తిగా సన్నద్ధంగా ఉంటే.. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే నేను అక్తర్ రికార్డు బ్రేక్ చేస్తాను. అయితే.. ప్రస్తుతం దేశం తరఫున ఉత్తమ ప్రతిభ కనబరచడం పైనే తన దృష్టంతా ఉంద’ని ఉమ్రాన్ మాలిక్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికట్లో వేగవంతమైన బంతి విసిరిన రికార్డు షోయెబ్ అక్తర్ పేరిట ఉంది. 2013 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అప్పటి నుంచి అతని వేగాన్ని అందుకునేందుకు చాలామంది ఫాస్ట్ బౌలర్లు ప్రయత్నించారు. కానీ ఎవరివల్లా కాలేదు.
జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. 2021 ఐపీఎల్లో నెట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్ ఇప్పడు భారత జట్టుకు ఆడుతున్నాడు. పోయిన ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదారాబాద్‌కు ఆడిన అతను అద్భుతంగా రాణించాడు. దాంతో మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అతడి ప్రతిభను మెచ్చుకున్నారు. ఇంకేం.. సెలక్షర్ల దృష్టిలో పడ్డాడు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ఎంపికయ్యాడు. తాజాగా శ్రీలంక సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఉమ్రాన్‌కు చోటు లభించింది.