లండన్ : వింబుల్డన్‌లో తొలి టైటిల్ వేటలో ఉన్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ) టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. బుధవారం సెంటర్ కోర్టులో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిన్నర్.. 7-6 (7/2), 6-4, 6-4తో పదో సీడ్ బెన్ షెల్టన్ (యూఎస్)ను ఓడించి వరుసగా రెండోసారి ఈ టోర్నీ సెమీస్‌కు అర్హత సాధించాడు. మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి.
బుధవారం ముగిసిన క్వార్టర్స్ మ్యాచ్‌లలో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్, స్విట్జర్లాండ్ బామ బెలిందా బెంచిచ్ తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్ చేరారు. స్వియాటెక్.. 6-2, 7-5తో 19వ సీడ్ సమ్సనోవను వరుస సెట్లలో చిత్తు చేసింది. ఈ టోర్నీలో సెమీస్ చేరడం స్వియాటెక్‌కు ఇదే ప్రథమం. ఇక మరో పోరులో అన్‌సీడెడ్ బెలింద.. 7-6 (7/3), 7-6 (7/2)తో రష్యాకు చెందిన 18 ఏండ్ల మిర్రా ఆండ్రీవాను ఓడించి లాస్ట్ 4కు చేరుకుంది.